డీహెచ్ఎంవో హైదరాబాద్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. ఒకింత మంచి వేతనంతో?

డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ హైదరాబాద్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్దమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ నెల 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేడాగా ఉంది. మెడికల్ ఆఫీసర్ (బస్తీ దవాఖానా 15), మెడికల్ ఆఫీసర్ (పల్లేటివ్ కేర్ సెంటర్) 2, సైకియాట్రిస్ట్ 1 ఉన్నాయి.

సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైతే నెలకు 52 వేల రూపాయల వేతనం లభించనుండగా సైకియాట్రిస్ట్ ఉద్యోగానికి ఎంపికైన వాళ్లకు నెలకు 1,30,000 రూపాయల వేతనం లభించనుంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఆఫ్ లైన్ ద్వారా వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. దరఖాస్తు చేసుకోవడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో వేగంగా దరఖాస్తు చేసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. అర్హత ఉన్నవాళ్లు సంస్థ సికింద్రాబాద్ అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది. అర్హత ఉన్నవాళ్లకు దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో ప్రయోజనం కలగనుంది చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి సందేహాలు ఉంటె వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.