హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ వివరాలు ఇవే.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 81 ఆపరేటర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. అక్టోబర్ నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. hal-india.co.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అధికారిక నోటిఫికేషన్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 22,000 నుండి రూ. 23,000 వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈమెయిల్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను పంపడం జరుగుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మాజీ ట్రైనీలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు లేదా బ్యాంక్ ఇ-చలాన్ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో జాబ్ సాధించాలని భావించే వాళ్లకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉండగా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలుగుతుంది.