యూనియన్ బ్యాంక్ లో భారీ సంఖ్యలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

యూనియన్ బ్యాంక్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా యూనియన్ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణలో 304 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఏపీలో 549 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 2691 ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2025 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 15,000 రూపాయల స్టైఫండ్ లభించే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2025 సంవత్సరం మార్చి 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేకూరనుంది. యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురు చూసే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను సులువుగానే నివృత్తి చేసుకోవచ్చు.