మద్యం తాగితే ఆరోగ్యానికి మంచిదేనా.. పరిమితంగా తీసుకుంటే ఇన్ని లాభాలా?

మనలో చాలామంది మద్యం విషయంలో వేర్వేరు అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం కలిగే ఛాన్స్ ఉండగా పరిమితంగా మద్యం తీసుకుంటే మాత్రం ఎన్నో లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. మితంగా మద్యం తాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి. మితమైన మద్యపానం శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంతో పాటు మరణాల ప్రమాదం 25% తగ్గిస్తుందట.

బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు బీర్ సహాయపడుతుందని తెలుస్తోంది. రోజుకు ఒక గ్లాస్ బీర్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలగదు. రెడ్ వైన్‌లోని రెస్‌వెరాట్రాల్ కణాల జీవితాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు మానవుల ఆయుష్షును పెంచుతుంది. రెడ్ వైన్ తీసుకోవడం ద్వారా మెమొరీ పవర్ పెరిగే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.

రెడ్ వైన్ లో ఉండే రెస్వెరాట్రాల్ వల్ల జ్ఞాపకశక్తి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మితమైన మద్యపానం పురుషులలో సెక్స్ హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడుతుందని తెలుస్తోంది. రెడ్ వైన్ తీసుకోవడం ద్వారా అదనపు కొలెస్ట్రాల్‌ తగ్గడంతో పాటు ఊబకాయం సమస్య కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది.

వోడ్కా, వైన్ రెండూ గుండె-ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా నివారించడంలో తోడ్పడతాయి. జలుబుకు కారణమయ్యే వైరస్‌లతో పోరాడటానికి రెడ్ వైన్ లో ఉండే ఔషధ గుణాలు తోడ్పడతాయి. ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం మద్యానికి దూరంగా ఉంటే మంచిది.