కీళ్ల, మోకాళ్ల నొప్పులను దూరం చేసే అద్భుతమైన ఆహారాలివే.. ఇవి తింటే ఎన్నో లాభాలంటూ?

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని కీళ్ల, మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. తీసుకునే ఆహారంలో చేసే పొరపాట్లు, ఇతర కారణాల వల్ల ఎక్కువమంది ఈ ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు సైతం వెల్లడిస్తున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కీళ్ల, మోకాళ్ల నొప్పులను సులువుగా దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వృద్దులు, యుక్త వయస్సులో ఉండే వాళ్లను కీళ్ల, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వేధించడం జరుగుతుంది. కీళ్ల నొప్పుల సమస్యలతో బాధ పడేవాళ్లు ప్రధానంగా కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తే మంచిదని చెప్పవచ్చు. రాగులు, జొన్నలు, సజ్జలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య సులభంగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవాళ్లకు అరటిపండ్లు దివ్యౌషధం అని చెప్పవచ్చు. అరటిపండ్లలో ఉండే పొటాషియం ఎముకల సాంద్రతను పెంచడంతో పాటు అరటిలో ఉండే మెగ్నీషియం వల్ల కీళ్ల నొప్పుల నుంచి పూర్తిస్థాయిలో ఉపశమనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పైనాపిల్ ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయి.

ప్రతిరోజూ నారింజ పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. నారింజ పండ్లను తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా మారతాయి. పసుపు, పాలు తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న చేపలను తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. రొయ్యలు, బ్లూ బెర్రీలు, పీ నట్ బటర్, గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులను దూరం చేసుకోవడంతో పాటు అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.