అమ్మాయి పుట్టింటి నుంచి పొరపాటున కూడా ఈ వస్తువులను అత్తవారింటికి తీసుకురాకూడదు తెలుసా?

సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తవారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదైనా పండుగలు శుభకార్యాల నిమిత్తం పుట్టింటికి వెళ్లడం సర్వసాధారణం.ఇలా పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిలు పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులను అత్తవారింటికి తీసుకు వెళుతూ ఉంటారు.ఇక పుట్టింటి వారు కూడా తమ కూతురుకి ఏ లోటు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను లేదా కొన్ని సామాన్లను తమ కూతురితో పంపిస్తూ ఉంటారు.అయితే కొన్ని రకాల వస్తువులను మాత్రం కూతురు పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకుపోకూడదని పండితులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే అత్తవారింటికి కూతురు పుట్టింటి నుంచి ఏ వస్తువులను తీసుకువెళ్లకూడదు అనే విషయానికి వస్తే… ఉప్పు ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు. కనుక ఉప్పును ఎలాంటి పరిస్థితులలో పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్లకూడదు. వీటితోపాటు చీపురును కూడా అమ్మాయి ఎలాంటి పరిస్థితులలోనూ అత్తవారింటికి పుట్టింటి నుంచి తీసుకురాకూడదని పండితులు చెబుతున్నారు.చీపురును లక్ష్మీదేవితో భావిస్తారు కనుక పుట్టింటి నుంచి మనం అత్తారింటికి తీసుకెళ్లడం వల్ల పుట్టింటిలో ఉన్నటువంటి సంపద అత్తారింటికి వెళ్లిపోతుందని భావిస్తారు.

ఇలా లక్ష్మీ స్వరూపమైనటువంటి చీపురుని కూడా పుట్టింటి నుంచి అమ్మాయి అత్తవారింటికి తీసుకురాకూడదు. ఇక వీటితోపాటు చింతకాయ పచ్చడి, ఊరగాయలను కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకురాకూడదని చెబుతుంటారు.ఇలా తీసుకురావడం వల్ల పుట్టింట్లో ఉండే లక్ష్మీదేవిని మనం మన ఇంటికి తీసుకొచ్చినట్లు అని భావిస్తారు తద్వారా పుట్టింటి సంపద తగ్గిపోతుందని అందుకే ఈ వస్తువులను తెచ్చేటప్పుడు కాస్త డబ్బులు పుట్టింటి వారికి ఇచ్చి తీసుకోవాలి తప్ప ఉచితంగా తీసుకురాకూడదని పండితులు చెబుతున్నారు.

పుట్టింటి నుండి మహిళలు తెచ్చుకోకూడని 6 వస్తువులు ఏమిటో తెలుసా ? || Lakshmi Kataksham #astrology