హైబీపీ ఉన్నవాళ్లు అస్సలు తినకూడని ఆహార పదార్థాలు ఇవే.. ఈ విషయాలు తెలుసా?

ఈ మధ్య కాలంలో హైబీపీ సమస్యతో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తీసుకుంటే మంచిది. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను పరిమితం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, రెడ్ మీట్ లకు హైబీపీ ఉన్నవాళ్లు కచ్చితంగా దూరంగా ఉండాలి.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, ఆకుకూరలు, విత్తనాలు, గింజలు తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించడంతో పాటు రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ వాడటం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది.

ఆహారంలో మేలైన కొవ్వుల మోతాదుని పెంచుకోవడంతో పాటు విటమిన్‌ ఇ, సి, సెలీనియం, జింక్‌ వంటివి కూడా తగిన మొత్తంలో అందేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రైస్‌బ్రాన్, నువ్వులు, ఆవ నూనెల్ని వినియోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. రోజువారి ఆహారంలో కాల్షియం ఫుడ్ తగినంత ఉండేలా చూసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం, తగిన విశ్రాంతి తీసుకోవడమూ తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.

హై బీపీతో బాధ పడే వాళ్లు ప్రతిరోజూ టాబ్లెట్ కచ్చితంగా వేసుకోవాలి. మటన్, బీఫ్, పచ్చళ్లు, ఉప్పు, తీపి పదార్థాలు, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, ఆల్కహాల్ తాగడం వల్ల హైబీపీ బారిన పడే ఛాన్స్ ఉంది. హైబీపీతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.