ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువులలో చీపురు ఒకటి. ఇంట్లో చీపురును చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వాస్తు ప్రకారం చీపురు విషయంలో కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. చీపురు విషయంలో తప్పులు చేస్తే సమస్యలు పెరిగి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
చీపురును ఎలా పడితే అలా పడేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వ ఉండదు. చీపురును ఎప్పటికీ కాళ్లతో తొక్కడం లాంటి పనులు చేయకూడదు. ఈ విధంగా చేస్తే చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. వంట గదిలో చీపురును ఉంచడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. చీపురును ధనం, ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు.
చీపురును నిలబెట్టి ఉంచడం కూడా మంచిది కాదు. ఏదైనా తలుపుల వెనుక చీపురును అడ్డంగా ఉంచితే శుభం కలుగుతుంది. చీకటి పడ్డాక చీపురు వాడొద్దని పండితులు సూచిస్తున్నారు. పగటిపూట మాత్రమే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గురువారం, శుక్రవారం రోజున, ఏకాదశి వంటి మంచి రోజులలో పాడైపోయిన చీపురును పాడేయడం మంచిది కాదు. శనివారం మాత్రమే చీపురును పాడేయాలని పండితులు వెల్లడిస్తున్నారు.
విరిగిపోయిన చీపురును పారే కాలువలో ఎట్టి పరిస్థితుల్లో పడేయకూడదని పండితులు వెల్లడిస్తున్నారు. శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును చూడటం వల్ల చెడు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. చీపురును తరచుగా ఉపయోగించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది.