ప్రపంచ దేశాలలో ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువ అనే సంగతి తెలిసిందే. డయాబెటిస్ అంటే, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే వ్యాధి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరం తగినంత ఇన్సులిన్‌ను తయారు చేయకపోవడంతో పాటు శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల డయాబెటిస్ బారిన పడే ఛాన్స్ ఉంటుంది.
ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా చాలామంది ఈ వ్యాధి బారిన పడుతూ ఉంటారు. ప్యాంక్రీయాస్ దెబ్బతినడం, జన్యుపరమైన మార్పులు, కొన్ని మందులను తరచుగా తీసుకోవడం కూడా మధుమేహం లక్షణాలు అని చెప్పవచ్చు. తరచుగా మూత్రం రావడం, అధికంగా దాహం వేయడం, అలసట, దృష్టి సంబంధిత సమస్యలు, తరచుగా చర్మం లేదా యోనిలో యీస్ట్ ఇన్ఫెక్షన్లు డయాబెటిస్ లక్షణాలు అని చెప్పవచ్చు.
కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం కూడా డయాబెటిస్ ముఖ్య లక్షణాలు అని చెప్పవచ్చు. వయస్సును బట్టి షుగర్ లెవెల్స్ లో మార్పులు ఉంటాయి. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు తేనె తినవచ్చా తినకూడదా అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. తేనెలో ఆయుర్వేద గుణాలు సైతం పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ తో బాధ పడే వాళ్లు తేనె తినవచ్చు కానీ పరిమితంగానే తీసుకోవాలి.
తేనెలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పటికీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటిస్ తో బాధ పడేవాళ్లకు తేనె శ్రేయస్కరం కాదు. తేనెలో గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. మరీ అవసరం అయితే తప్ప తేనెను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని కచ్చితంగా చెప్పవచ్చు.