నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. రాతపరీక్ష లేకుండా భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు!

నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా అదిరిపోయే తీపికబురు వెలువడింది. కేంద్ర సాయుధ బలగాల్లో చేరి దేశ సేవ చేయాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేయగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా సీఆర్‌పీఎఫ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ నియామకాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ను నిర్వహిస్తారు.

crpf.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జులై నెల 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ విభాగంలో జనరల్ డ్యూటీ ఆఫీసర్స్ పోస్టులు 22 భర్తీ కానుండటం గమనార్హం. గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అభ్యర్థుల గరిష్ట వయసు 70 ఏళ్లలోపు ఉంటే ఇందుకోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుండగా ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ను నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ కోసం ఎలాంటి రాత పరీక్షను నిర్వహించే అవకాశం అయితే లేదని సమాచారం అందుతుండటం గమనార్హం.

ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే వాళ్లకు నెలకు 75,000 రూపాయల వేతనం లభించనుందని తెలుస్తోంది. పూణే, హైదరాబాద్, శ్రీనగర్, ఇంపాల్, గౌహతి, గాంధీనగర్‌ ప్రాంతాలలో ఉన్న సీఆర్‌పీఎఫ్ కాంపోజిట్ హాస్పటల్‌లో జులై నెల 31వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. అర్హత ఉన్నవాళ్లు ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.