కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు అందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ఉచిత పథకాలను ప్రకటించి ప్రజలను బద్దకస్తులను చేయకుండా ప్రజలకు మేలు చేసే పథకాలకు మాత్రమే కేంద్రం ఓటేస్తుండటం గమనార్హం. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపకుండా ఉండేలా ఎన్నో మంచి పథకాలు అమలవుతున్నాయి. సీనియర్ సిటిజన్లకు ఎక్కువగా మేలు చేసే స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుంటే మంచిది.
పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఒకటైన పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో ఎక్కువ మొత్తంలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే భారీ మొత్తం వడ్డీ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను సైతం పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు కేంద్రం అందిస్తున్న బెస్ట్ స్కీమ్స్ లో ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు.
ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ ద్వారా 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులు ఉచితంగా 5 లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ సంఖ్యలో వ్యాధులకు సంబంధించి కవరేజీ లభించే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరమైన స్కీమ్ అని చెప్పవచ్చు.
ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుని ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను సులువుగానే పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ కు సంబంధించి సందేహాలు ఉంటే సంస్థ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.