పదో తరగతి అర్హతతో సీఆర్పీఎఫ్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. వేతనం ఎంతంటే?

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 169 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. జనవరి నెల 16వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత ప్రతిభ మెరుపరచాలనే ఆసక్తి ఉన్నవాళ్లకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా 2024 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది.

బయోమెట్రిక్ ధృవీకరణ, డాక్యుమెంటేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. క్రీడా విభాగంలో ఫీల్డ్ టెస్ట్,
మెడికల్ టెస్ట్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది.

సంస్థ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 69 వేల రూపాయల వరకు వేతనం లభిస్తున్న నేపథ్యంలో అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల వల్ల నిరుద్యోగులకు ఎంతో బెనిఫిట్ కలుగుతుంది.