మన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అయితే వంటనూనెల ధరలు మాత్రం అంతోఇంతో అదుపులో ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సామాన్యులకు తాజాగా భారీ షాకిచ్చే దిశగా అడుగులు వేసింది. దేశంలో రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎక్కువ మొత్తంలో వంటనూనెను వినియోగించే వాళ్లు ఇప్పుడే వంటనూనెను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. ముడిచమురు, శుద్ధి చేసిన ఎడిబుల్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని భారత ప్రభుత్వం ఏకంగా 20 శాతం పెంచడంతో ఎడిబుల్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయని సమాచారం అందుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల సోయాబీన్ సహా ఆయా పంటలను పండించిన రైతులకు నిర్ణయించిన కనీస మద్దతు ధర లభించనుందని సమాచారం.
భారతదేశంలో కూరగాయల నూనె డిమాండ్‌లో 70 శాతానికి పైగా దిగుమతుల ద్వారా వస్తుండటం గమనార్హం. పామాయిల్ ప్రధానంగా ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోంది. మరికొన్ని రోజుల్లో వంటనూనె ధరలు భారీగా పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. వచ్చే వారం పామాయిల్ ధరలపై భారత సుంకం పెంపు ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
సామాన్యుల కంటే హోటల్ వ్యాపారం చేస్తున్న వాళ్లపై ఈ ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వంటనూనెలకు సంబంధించి ఎన్నో కంపెనీల నూనెలు అందుబాటులో ఉన్నాయనే సంగతి తెలిసిందే.