ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా.. ఆ స్థాయిలో పెరిగితే ఇబ్బందేగా?

గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ప్రత్యక్షముగా పరోక్షంగా దేశంలో వేర్వేరు అంశాలపై ప్రభావం చూపుతోంది. అయితే రాబోయే రోజుల్లో చమురు ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చమురు ధరలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఇరాన్ లోని అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ హర్ముజ్ జలసంధి మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగితే మాత్రం ఇబ్బందేనా అని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మన దేశం చమురు అవసరాల కోసం 90 శాతం ఇతర దేశాలపై ఆధారపడుతోంది. చమురు సంక్షోభం ప్రభావం ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు 10 రూపాయల చొప్పున పెరిగినా కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మరో 75 రోజుల పాటు భారత్ కు ఇబ్బందులు లేవని ఆ తర్వాత మాత్రం ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వివాదం సద్దుమణిగితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం

ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రభావం రూపాయి విలువపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందనే చర్చ సైతం జరుగుతోంది. ఇరాన్ లో యుద్ధం ఇతర దేశాలపై తీవ్రస్థాయిలో ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి.