దగ్గు సమస్య ఎక్కువగా వేధిస్తోందా.. సులభంగా చెక్ పెట్టే ఇంటి చిట్కాలు ఇవే!

మనలో చాలామందిని వేధించే ఆరోగ్య సమస్యలలో దగ్గు సమస్య కూడా ఒకటి. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా దగ్గు సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. టాబ్లెట్లు వాడినా దగ్గు తగ్గకపోతే మాత్రం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. నీళ్ళలో తులసి ఆకులు వేసి మరిగించి చల్లారిన నీటిని తాగడం ద్వారా పొడి దగ్గు సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు. పాలలో మిరియాల పొడి వేసి తాగడం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు.

తులసి ఆకులను నేరుగా తీసుకున్నా దగ్గు సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. తమలపాకులు నమలడం ద్వారా కూడా పొడి దగ్గు సమస్య దూరం అవుతుంది. కరక్కాయ పొడి తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అల్లం టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం అయితే ఉంటుంది. నిమ్మరసం, తేనె, పసుపు కలిపిన మిశ్రమం తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.

సొంఠి పొడిలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుందనే సంగతి తెలిసిందే. దగ్గు సమస్య వేధిస్తే రాత్రి సమయాల్లో ఇబ్బందులు పడాల్సి ఉంది. ఎత్తు ఎక్కువగా ఉన్న దిండు తీసుకోవడం ద్వారా కూడా తలనొప్పి సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. దగ్గు సమస్యను వేగంగా తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే మంచిదని చెప్పవచ్చు.

తేనె తీసుకోవడం వల్ల పొడి దగ్గు సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం ద్వారా కూడా దగ్గు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆవిరి పట్టుకోవడం ద్వారా కూడా దగ్గు సమస్య దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఉప్పునీటితో పుక్కిలించడం ద్వారా దగ్గు దూరమవుతుంది. అల్లం తీసుకోవడం ద్వారా దగ్గు సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.