ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాల లోపం ఉంటే, పొడిబారిన చర్మం, కీళ్ల నొప్పులు, మానసిక స్థితిలో మార్పులు, మతిమరుపు, గుండె సంబంధిత సమస్యలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి చాలా అవసరం, ఇవి గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, కీళ్ల ఆరోగ్యం వంటి వాటికి సహాయపడతాయి. ఈ లోపం ఉంటే చర్మం పొడిబారి, పొలుసులుగా మారుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో కీళ్లలో వాపు, నొప్పి ఉండవచ్చు.
డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, మతిమరపు వంటివి ఈ లోపం ఉన్నవారిలో కనిపించవచ్చు. గుండె సంబంధిత సమస్యలు వేధిస్తున్న ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. ఒమేగా3 అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అవి: చేపలు (సాల్మన్, ట్యూనా, మాకేరెల్), అవిసె గింజలు, చియా గింజలు, వాల్ నట్స్, సోయాబీన్స్ వంటివి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
అవసరమైతే డాక్టర్ సలహా మేరకు ఒమేగా3 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాల లోపం ఉందని అనుమానం ఉంటే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటే డెర్మటాలజిస్ట్ ను కలవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో వాపును తగ్గించడంతో పాటు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించే అవకాశం అయితే ఉంటుంది.
గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గించడంలో నాడీ వ్యవస్థను బలోపేతం చేసి మెదడు పనితీరును మెరుగుపరిచే విషయంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను చాలా ముఖ్యమైన పోషకాలుగా పరిగణించాల్సి ఉంటుంది. శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉంటే అనేక సమస్యలను ఎదుర్కోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లోపం కారణంగా ఆలోచనా శక్తి తగ్గడం, మూడ్ డిజార్డర్‌లు సైతం తలెత్తుతాయి.