మధుమేహంతో బాధపడే వాళ్లకు తీపికబురు.. ఈ డ్రింక్ తాగితే సమస్యకు చెక్!

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది మధుమేహం సమస్యతో బాధ పడుతున్నారు. మధుమేహం బారిన పడితే కొన్నిసార్లు జీవితాంతం మందులు వాడితే మాత్రమే ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుందని చెప్పవచ్చు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో పెట్టుకోవడం కచ్చితంగా సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

రోజూవారీ ఆహారంలో అదనంగా, కార్బోహైడ్రేట్లను తగ్గించి వీటికి బదులుగా ప్రోటీన్లను తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాయామాల వలన మధుమేహ వ్యాధి కంట్రోల్ లో ఉండటంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే అందుబాటులో ఉన్న మరొక సులువైన మార్గం బరువు తగ్గటం అని చెప్పవచ్చు. బరువు తగ్గటం వలన ఇన్సులిన్‌కు శరీరం మరింత సున్నితంగా మారే ఛాన్స్ ఉంటుంది.

బార్లీ వాటర్ ప్రతిరోజూ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ పూర్తిస్థాయిలో అదుపులో ఉంటాయని చెప్పవచ్చు. బార్లీ వాటర్‌లోని ఫైబర్, ఇతర పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుంది. కాకరకాయను కూరగా లేదా రసం రూపంలో తీసుకోవటం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని చెప్పవచ్చు.

పచ్చని ఆకుకూరలు తినటం వలన ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు కలుగుతాయి. మధుమేహ వ్యాధిని తగ్గించే ప్రణాళికలో ఆహారంతో పాటు వ్యాయామాలు ముఖ్యమని చెప్పవచ్చు. 30 నిమిషాల ఏరోబిక్ వ్యాయామాల వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ లో ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.