బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో భారీ సంఖ్యలో జాబ్స్.. నెలకు 64,000 రూపాయల వేతనంతో?

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్పోర్ట్స్ కోటా కింద కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిద్ధమైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఆసక్తి ,అర్హతలు ఉన్నవాళ్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

bankofmaharashtra.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. జులై 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 64,400 రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. జనరల్, ఈడబ్లూఎస్, ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 590 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 118 రూపాయలుగా ఉంది.

జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్‌ఎం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్‌ఆర్‌ఎం డిపార్ట్‌మెంట్, హెడ్ ఆఫీస్, లోక్‌మంగల్, 1501, శివాజీనగర్, పూణే 411005 అడ్రస్ కు పోస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.