బరువు పెరగాలని కోరుకుంటున్నారా.. ఈ ఆహార నియమాలు పాటిస్తే తిరుగులేదంతే!

మనలో చాలామంది బరువు విషయంలో భిన్నమైన ఆలోచనలను కలిగి ఉంటారు. కొంతమంది బరువు పెరగడానికి ప్రాధాన్యత ఇస్తే మరి కొందరు బరువు తగ్గడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రోజుకు అరలీటరు పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా బరువు పెరగవచ్చు.

రెండు గుడ్లు, రెండు వందల గ్రాముల చికెన్‌ లేదా చేప తీసుకోవడం ద్వారా సులువుగా బరువు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. రెండు మూడు కప్పుల కాయగూరలు లేదా ఆకుకూరలు తీసుకోవడం ద్వారా బరువును పెంచుకోవచ్చు. పళ్ళు, బాదం, ఆక్రోట్‌ తీసుకోవడం ద్వారా కూడా బరువు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. బరువు పెరిగేప్పుడు కొవ్వు కంటే కండరాలు ఎక్కువగా పెరగాలి కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలు, కందులు, పెసలు, సోయాచిక్కుడు, అలసందలు, సెనగలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అంచి ఫలితాలు ఉంటాయి. పప్పు ధాన్యాల్లో, పండ్లలో ఉండే సాల్యుబుల్‌ ఫైబర్‌ మలవిసర్జన తేలికగా అయ్యేందుకు తోడ్పడుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఆహారా నియమాలను పాటిస్తే సులువుగా బరువు పెరగవచ్చు.

ఆరోగ్యకరంగా బరువు పెరగడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే వైద్యులను సంప్రదించి వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా బరువు పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బరువు పెరగాలని ఫీలయ్యే వాళ్లు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.