కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఏకంగా ఇన్ని లాభాలు ఉన్నాయా?

మనలో చాలామంది వంటకాలలో ఎక్కువగా వినియోగించే వాటిలో కొత్తిమీర ఒకటి. కొత్తిమీర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా మధుమేహం బాధితులకు పచ్చి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. పచ్చి కొత్తిమీర తినటం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు పచ్చి కొత్తిమీరను తింటూ ఉంటే ఆ సమస్య త్వరగా తీరిపోతుంది.

రక్తంలో ఇన్సులిన్ పరిమాణం నియంత్రణలో ఉంచడంలో కొత్తిమీర తోడ్పడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడానికి కూడా కొత్తిమీర తోడ్పడుతుందని చెప్పవచ్చు. పచ్చి కొత్తిమీరతో పాటుగా ధనియా వాటర్ ను కూడా కొలెస్ట్రాల్‌ను సైతం తగ్గిస్తుంది. కొత్తిమీరలో ఉండే మూలకం కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

పచ్చి కొత్తిమీర తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్ ఎ లభిస్తుంది. పచ్చి కొత్తిమీరలో ఉండే మూలకాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి. శరీరానికి చలువ చేసే గుణం పచ్చి కొత్తిమీరకు ఉంటుందని చెప్పవచ్చు. పచ్చికొత్తిమీరతో ప్రాణాంతక క్యాన్సర్ వంటి ప్రమాదాలను కూడా తగ్గించుకోవచ్చునని వైద్యులు వెల్లడిస్తున్నారు. కొత్తిమీర ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్-ఎ, విటమిన్ సి లభిస్తాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా కొత్తిమీర పని చేస్తుందని చెప్పవచ్చు. కొత్తిమీరను నీటిలో వేసి మరిగించి ఫిల్టర్ చేసి తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడేవాళ్లు కొత్తిమీర నీరు తీసుకుంటే మంచిది. కొతిమీర నీరు రక్తంలో ఇన్సులిన్ పరిమాణం సరిగ్గా ఉండేలా చేస్తుంది.