లక్ష్మణ ఫలం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.. ఆ సమస్యలు దూరమవుతాయా?

మనలో చాలామంది లక్ష్మణ ఫలం తినడానికి ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. లక్ష్మణ ఫలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. లక్ష్మణ ఫలాన్ని ఆంగ్లంలో ఆనోనా మ్యూరికాటా అనే పేరుతో పిలుస్తారు. ఈ పండ్ల ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ బీ1, విటమిన్ బీ2 లభించే అవకాశం అయితే ఉంటుంది. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో లక్ష్మణ ఫలాలు విరివిగా లభిస్తాయి.

ఈ పండ్ల గింజలను నీళ్లలో కలిపి రాసుకుంటే కండరాల నొప్పులు సులభంగా దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ పండ్లు తినడం వల్ల బాలింతలలో పాలు వృద్ధి చెందుతాయి. రొమ్ము క్యాన్సర్ కణితులకు చెక్ పెట్టడంలో ఈ పండ్లు సహాయపడతాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ శక్తి బలపడుతుంది. మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టడంలో ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

ఈ పండ్లలో శరీరానికి అవసరమైన ఇమ్యూనిటీ ఇచ్చే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పండ్లు తీసుకోవడం ద్వారా రక్తపోటు, షుగర్, క్యాన్సర్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. సోర్సోప్ అనే పేరుతో పిలవబడే ఈ పండు రుచిగా ఉండటంతో పాటు బయట ఆకుపచ్చ రంగులో లోపల తెలుపు రంగులో ఉంటుంది. స్ట్రాబెర్రీ, పైనాపిల్ పండ్లను తింటే ఎలాంటి రుచి ఉంటుందో ఈ పండ్లను తింటే సైతం అలాంటి రుచి ఉంటుంది.

ఈ పండ్లను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఎన్నో వ్యాధులను దూరం చేసే ఈ పండును ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ పండ్ల చెట్టు బెరడును, ఆకులను, విత్తనాలను ఆయుర్వేద వైద్య తయారీలో వినియోగిస్తుండటం గమనార్హం. ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు.