ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశంలోని ప్రదాన నగరాలపై దాడిని తీవ్రతరం చేశాయి రష్యా బలగాలు.. తాజాగా దక్షిణ ఉక్రెయిన్లోని అతిపెద్ద సిటీ అయిన ఖేర్సన్ను స్వాధీనం రష్యా రక్షణ బలగాలు స్వాధినం చేసుకున్నాయి. ఖేర్సన్పై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించడంతో ఉక్రెయిన్ సైనికులతో పాటు, పౌరులు కూడా పెద్ద సంఖ్యలో మృతిచెందినట్టుగా తెలుస్తోంది. కరాజిన్ నేషనల్ యూనివర్సిటీ, పోలిస్ భవనం పూర్తిగా ధ్వసమైంది.