మహిళలు నైటీలు ధరించడం వల్ల కలిగే నష్టాలివే.. ఇన్ని సమస్యలు వస్తాయా?

ఈ మధ్య కాలంలో మహిళల్లో చాలామంది నైటీలు ధరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నైటీలు ధరించడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. కాటన్ తో నైటీలను తయారు చేయడం జరుగుతుంది. శరీరానికి స్వేచ్చగా గాలి తగిలేలా చేయడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

అయితే నైటీలు ధరించడం వల్ల లాభాల కంటే ఎక్కువగా నష్టాలు సైతం ఉన్నాయి. ఈ నష్టాల గురించి తెలుసుకోని పక్షంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తక్కువ నాణ్యతతో తయారు చేసిన నైటీలు ధరించడం వల్ల కంఫర్ట్ ఉండకపోవడంతో పాటు ఆ నైటీలు ఎక్కువ కాలం మన్నిక ఉండవు. ఇలాంటి నైటీల వల్ల కొన్ని సందర్భాల్లో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

నైటీలను ఎక్కువ రోజుల పాటు ధరిస్తే వాటిపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. నైటీలను ధరించడం వల్ల కొన్నిసార్లు చెమట వచ్చి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. నాణ్యత ఉన్న నైటీలను మాత్రమే కొనుగోలు చేస్తే మంచిది. నైటీలు ధరించేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నైటీలను ధరించే వాళ్లు ఈ సమస్యలను సైతం గుర్తుంచుకుంటే మంచిది.

నైటీలు ధరించి వంట చేయడం కూడా మంచిది కాదని చాలామంది భావిస్తారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నైటీలు తక్కువ సమయంలో కాలిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.