అరటిపండు తిన్న వెంటనే నీరు తాగకూడదని పెద్దలు చెబుతుంటారు. నిజానికి అరటిపండు ఎక్కడైనా ఎప్పుడైనా సులభంగా దొరికేది, తీయగా, మృదువుగా, చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైనది ఈ అరటి పండు. అయితే దీన్ని తిన్న వెంటనే గ్లాసు నీరు తాగడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే వైద్యులు ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం వర్షాకాలం, ఆ తర్వాత వచ్చే శీతాకాలం ఇలాంటి కాలాల్లో శరీర రోగ నిరోధక శక్తి కొద్దిగా బలహీనంగా ఉంటుంది. అలాంటి సమయంలో అరటిపండు తిన్న వెంటనే చల్లటి నీరు తాగితే గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, గొంతులో ఇన్‌ఫెక్షన్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అరటిపండు స్వభావతః చల్లదనం కలిగించే పండు. అందులో సహజ చక్కెర, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియకు కొంత సమయం అవసరం. ఆ సమయాన్ని ఇవ్వకుండా చల్లటి నీరు తాగితే ఆ తారుమారు ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా జీర్ణకోశానికి పనులు పెరుగుతాయి. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, bloating, acidity వంటి సమస్యలు వేధిస్తాయి.
అంతేకాదు, చిన్న పిల్లలు తరచూ అరటిపండు తిన్న వెంటనే నీరు తాగుతారు. తల్లిదండ్రులు వీలైనంత వరకూ ఆ అలవాటు వద్దని నిరోధించాలి. చిన్న వయసులో జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి, ఏ చిన్న తప్పు చేసినా వెంటనే సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, bloating వలన చిన్నారులు అసహనం చెందుతారు.
కేవలం ఆయుర్వేదమే కాదు, ఆధునిక వైద్య నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. సాధారణంగా శక్తిమంతమైన జీర్ణవ్యవస్థ కలవారికి పెద్ద సమస్యేమీ ఉండదు. కానీ జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉన్నవారికి..పెద్దలు, పిల్లలు, లేదా acidity, gastritis వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇది చిక్కే సమస్య. అందువల్ల అరటిపండు తిన్న వెంటనే కాకుండా, కనీసం 20 నుంచి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరు తాగడం మంచిదని వారు సూచిస్తున్నారు.
