ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఎదిగే పిల్లలకు ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా ఇస్తే పోషకాహార లోపం తొలగిపోయి త్వరితగతిన శారీరక,మానసిక పరిపక్వత చెందుతారని సూచించడం జరిగింది. అయితే ఈ రోజుల్లో చాలా మందికి గుడ్డులోని పచ్చ సోనను పక్కన పడేయడం ఫ్యాషన్ గా మారింది. అందుకు గల కారణాలను పరిశీలిస్తే గుడ్డు పచ్చ సోనా భాగంలో అధిక కొలెస్ట్రాల్ ఉండడమే. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతం పెరగడం లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కావున అపోహలు మాని నిక్షేపంగా ప్రతి ఒక్కరూ గుడ్డు మొత్తాన్ని ఆహారంగా తీసుకోవచ్చు.
ప్రతిరోజు గుడ్డును ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్,విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.ముఖ్యంగా గుడ్డులో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ b6, విటమిన్ బి12 పుష్కలంగా ఇష్టంగా లభిస్తాయి కావున మనలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడి రక్తహీనత సమస్యను తగ్గించి రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
గుడ్డులో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ మరియు ల్యూటిన్ అనే సహజ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభించి కంటికి సంబంధించిన సమస్యలన్నీ తొలగి కంటిచూపు మెరుగుపడుతుంది.
గుడ్డులో పుష్కలంగా ఉన్న విటమిన్ డి, కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజ లవణాలు వృద్ధాప్యంలో వచ్చే ఎముక బోలు వ్యాధి,కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, రీకెట్స్, రుమటాయిడ్, కీళ్లవాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుడ్డులో అత్యధికంగా లభించే ప్రోటీన్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు కండరాలను పటిష్టం చేసి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించి వృద్ధాప్య లక్షణాలను తొలగిస్తుంది.