నల్ల ఉప్పును రోజువారి ఆహారంలో వినియోగిస్తే మన ఆరోగ్యానికి లాభమా? నష్టమా?

మన రోజువారి ఆహారంలో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు మనం తినే ఆహారానికి రుచిని ఇవ్వడంతోపాటు మన శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలను అందించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా సోడియం, అయోడిన్ వంటి మూలకాలు ఉప్పులో సమృద్ధిగా లభిస్తాయి. ఉప్పును పరిమితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని, థైరాయిడ్ సమస్యలను, రక్తప్రసరణ వ్యవస్థను, కిడ్నీ పనితీరును, మెరుగుపరుస్తుంది. మోతాదుకు మించి ఉప్పును ఆహారంలో తీసుకున్నట్లయితే రక్త ప్రసరణ వేగం పెరిగి హైబీపీ సమస్య, అధిక కొలెస్ట్రాల్, కిడ్నీలో రాళ్ల వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే ప్రమాదముంది.

ప్రతిరోజు మన ఆహారంలో తీసుకునే తెల్ల ఉప్పుకు బదులు ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొంది అధిక ఖనిజ లవణాలు ఉన్న నల్ల ఉప్పును ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు నల్ల ఉప్పు అంటే ఏమిటి, ఎక్కడి నుంచి నల్ల ఉప్పు లభిస్తుంది, నల్ల ఉప్పును ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల ఉప్పును హిమాలయాలలో అరుదుగా లభించే కొన్ని రకాల రాళ్ల నుంచి లభిస్తుంది.ఇందులో 82 రకాల సహజ ఖనిజ లవణాలతోపాటు అయోడిన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. నల్ల ఉప్పులో సల్ఫర్ మోతాదు ఎక్కువగా ఉండటంవల్ల ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. నల్ల ఉప్పును ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వినియోగిస్తారు.

తరచూ నల్ల ఉప్పును తగిన మోతాదులో మన ఆహారంలో వినియోగిస్తే అధిక బరువు సమస్యతో బాధపడేవారు సునాయాసంగా స్వల్ప కాలంలోనే శరీర బరువును తగ్గించుకోవచ్చు . ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బుల సమస్యతో బాధపడేవారు తరచూ నల్ల ఉప్పును ఉపయోగిస్తే రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తీవ్రమైన మలబద్ధక సమస్యతో బాధపడేవారు తమ రోజువారి ఆహారంలో నల్ల ఉప్పును వినియోగిస్తే పేగు కదలికలు సక్రమంగా జరిగి జీర్ణక్రియ రేటు పెరుగుతుంది తద్వారా మలబద్ధకం గ్యాస్ట్రిక్ వాంతులు విరేచనాలు వంటి సమస్యలను అదుపులో ఉంచవచ్చు.