బీపీ అకస్మాత్తుగా డౌన్ అవుతోందా.. కచ్చితంగా పాటించాల్సిన క్రేజీ చిట్కాలు ఇవే!

ఈ మధ్య కాలంలో చాలామంది బ్లడ్ ప్రెజర్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్య బారిన ఒకసారి పడితే దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తపోటు తగ్గిపోవడాన్ని హైపోటెన్షన్ అంటారనే సంగతి తెలిసిందే. ఇది అకస్మాత్తుగా తీవ్రంగా తగ్గిపోతే, శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్ తక్కువ రక్తపోటుకు ఎక్కువగా కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది.

హృదయ స్పందన రేటులో సమస్యలు కూడా బీపీ డౌన్ కావడానికి కారణం అవుతాయని చెప్పవచ్చు. సరైన ఆహారం తీసుకోకపోవడం, సరైన రక్త ప్రసరణ లేకపోవడం థైరాయిడ్ సమస్యలు, అడ్రినల్ గ్రంథి సమస్యలు, కొన్ని నరాల సంబంధిత వ్యాధులు బీపీ డౌన్ కావడానికి కారణం అవుతాయని చెప్పవచ్చు. అకస్మాత్తుగా తీవ్రమైన తగ్గుదల శరీరానికి ఆక్సిజన్ కొరతను కలిగించే అవకాశాలుంటాయి.

లో బీపీ గుండె, మెదడు మరియు ఇతర అవయవాలకు హాని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ రకమైన తక్కువ రక్తపోటుకు వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆడవారిలోనే లో-బీపీ సమస్య అధికంగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాల మోతాదులు తగ్గినా బీపీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది.

బాదంపప్పును పాలతో కలిపి తీసుకుంటే లో బీపీ సమస్య దూరమవుతుంది. తులసి తీసుకోవడం ద్వారా కూడా లో బీపీ సమస్యను అధిగమించవచ్చు. ప్రతిరోజూ 4 నుంచి 5 తులసి ఆకులు తినడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఎండు ద్రాక్షలు తినడం ద్వారా కూడా సమస్యలను అధిగమించవచ్చు. లో బీపీ ఉన్నవాళ్లు కాఫీ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ఉప్పునీరు తాగడం వల్ల బీపీని అదుపులో ఉంచుకునే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా, యువకులు మరియు ఆరోగ్యకరమైన పెద్దలకు సాధారణ రక్తపోటు స్థాయిలు 90/60 మరియు 120/80 మధ్య తగ్గుతాయి. రీడింగ్ 140/90 చూపిస్తే, మీరు అధిక రక్తపోటును ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాలి.