ఉత్తరేణి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఏకంగా ఇన్ని లాభాలున్నాయా?

మనలో చాలామంది ఉత్తరేణి మొక్క గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. ఉత్తరేణి మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంది. ఈ గింజల పొడిని వాడటం వల్ల పంటి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యకు చెక్ పెట్టడంలో ఉత్తరేణి తోడ్పడుతుంది. ఈ ఆకుల రసంలో నువ్వుల నూనె వేసి మరిగించి చల్లారిన నూనెను పొట్టపై వేసుకుంటే కొవ్వు సులువుగా కరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపై వేసి పొగ పీల్చితే ఉబ్బసం దగ్గు సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఆకులను ఆముదంతో కలిగి ఉపయోగిస్తే గజ్జి, తామర సమస్యలను దూరం చేసుకోవచ్చు. కందిరీగలు, తేనెటీగలు, తేళ్లు కుట్టిన సమయంలో ఉత్తరేణి ఆకులను ముద్దగా నూరి పెడితే ఆ సమస్య తగ్గుతుంది. శరీరంపై దురద, పొక్కులు, పొట్టు రాలడం లాంటి సమస్యలను సైతం ఉత్తరేణి దూరం చేస్తుంది.

వినాయక చవితి పండుగ సమయంలో వినాయకుడిని పూజించడానికి ఉత్తరేణిని వాడితే మంచిది. ఆయుర్వేదంలో ఉత్తరేణికి ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఉత్తరేణి మొక్కను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టే ఔషధ గుణాలు ఉత్తరేణి మొక్కల్లో ఉన్నాయి. ఈ మొక్క నుంచి తీసిన కషాయం కిడ్నీల సమస్యలకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది.

ఉత్తరేణి విత్తనాలను పాలతో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి దూరమవుతుంది. అజీర్ణ సమస్యలకు ఉత్తరేణి దివ్యౌషధం అని చెప్పవచ్చు. ఉబ్బసంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో ఉత్తరేణి ఉపయోగపడుతుంది.