హై బీపీ సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ ఒక్క ఇంజక్షన్ తో ఆ సమస్యకు సులువుగా చెక్?

ప్రస్తుతం ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో హై బీపీ ఒకటి కాగా ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు మాత్రం అన్నీఇన్నీ కావు. హై బీపీ వల్ల బీపీ, షుగర్, గుండె సమస్యలతో పాటు ఇతర అరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశం అయితే ఉంటుంది. మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు హైబీపీ సమస్యతో బాధ పడుతున్నారని తెలుస్తోంది.

అయితే ఒకసారి బీపీ సమస్య వస్తే తరచూ మందులు వాడాల్సి ఉంటుంది. మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరిని హైబీపీ సమస్య వేధిస్తోందని తెలుస్తోంది. అయితే హై బీపీ సమస్యకు పరిష్కారం చూపించడానికి అల్నిలామ్ అనే సంస్థ ఒక ఔషధాన్ని తయారు చేయడం గమనార్హం. ఈ ఔషధాన్ని వినియోగించడం వల్ల హై బీపీ సమస్య దూరం కావడంతో పాటు కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ఇంజక్షన్ ను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. జిలెబ్‌సిరాన్ అనే పేరుతో ఉన్న ఈ ఔషధం బీపీని ఆరు నెలల పాటు కంట్రోల్ లో ఉంచగలదు. ఈ ఔషధం వాడటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు సైతం తగ్గుతాయి. హై బీపీ సమస్య వేధిస్తుంటే ట్యాబ్లెట్లపై ఆధారపడటానికి బదులుగా ఈ ఔషధం తీసుకుంటే మంచిది.

త్వరలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఔషధం అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ఇంజక్షన్ వాడటం వల్ల హైబీపీ సమస్య వేధించినా దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుంది.