మనలో చాలామంది నెయ్యి తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. నెయ్యి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పరగడుపున నెయ్యి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొంతమంది కూరల్లో కూడా నెయ్యిని వేసుకుంటారు. పరగడుపున టీ స్పూన్ నెయ్యి తీసుకున్నా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పరగడుపున నెయ్యి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
గ్యాస్, అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలను నెయ్యి సులువుగా దూరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. దృష్టి సంబంధ సమస్యలు ఉన్నవల్లు నెయ్యి తినడం ద్వారా ఆ ఆరోగ్య సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చు. నెయ్యి తినడం ద్వారా విటమిన్ ఎ పుష్కలంగా లభించడంతో పాటు దృష్టి సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని వైద్యులు సైతం చెబుతున్నారు.
పరిమితంగా నెయ్యి తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉండవని వైద్యులు వెల్లడిస్తున్నారు. నెయ్యి తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. నెయ్యిలో ఉండే విటమిన్ డి ఎముకలకు బలాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. కొంత మొత్తంలో నెయ్యిని తీసుకోవడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది.
నెయ్యి తినడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేకపోవడంతో నెయ్యిని ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. నెయ్యిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని కామెంట్లు చేస్తున్నాయి.