Home Health & Fitness Almond Milk: బాదంపాలు తాగితే ఉపయోగాలు చాలా..! పురుషులకైతే..

Almond Milk: బాదంపాలు తాగితే ఉపయోగాలు చాలా..! పురుషులకైతే..

Almond Milk: బాదంపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తెలిసిన విషయమే. కానీ.. బాదంపాలు కూడా ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ కేలరీలు ఉంటాయి. దీంతో బాదంపాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. బాదంలో కాల్షియం, మాంగనీస్, విటమిన్ కె, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, జింక్, రాగి శరీరానికి మేలు చేస్తాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు.. చర్మం మృదువుగా ఉండేందుకు.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడుతుంది. ఆవు, గేదె పాలు తాగడంలో సమస్య ఉంటే బాదం పాలు తీసుకోవడం ఉత్తమం. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలి.

| Telugu Rajyam

ఒక గ్లాసు నీటిలో నానబెట్టిన బాదంపప్పులను వేసి గ్రైండర్లో కలపాలి. ఇవి మామూలు పాలలానే కనిపిస్తాయి. ఆవు పాలతో పోలిస్తే వీటిలో 80 శాతం కేలరీలు తక్కువగా ఉంటాయి. తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవాలని భావించేవారు ఈ పాలను తీసుకోవచ్చు. డయాబెటిస్‌తో బాధపడేవారు మామూలు పాలను బదులు బాదం పాలను తీసుకోవడం ఉత్తమం. ఇందులో చక్కెర శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఔన్స్ బాదం పాలు ‘విటమిన్ ఇ’ని 20-50 శాతం వరకు సరఫరా చేస్తుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండటంతో మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మనలోని ఒత్తిడి, మంటను తొలగిస్తుంది.

బాదంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు బాదం పాలలో 20-45 శాతం కాల్షియం సరఫరా చేస్తుంది, ఇది గుండె, ఎముకలు, నరాలు పనిచేయడంలో సహాయపడుతుంది. గుండె పనితీరు, ఎముకల పటిష్టత, రోగనిరోధక శక్తిని పెంచేందుకు శరీరానికి విటమిన్ డి అవసరం. ఇది ఎక్కువగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. బాదం పాల నుంచి కూడా డి విటమిన్ పొందొచ్చు. బాదంపాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని తాగొచ్చు. పురుషులకు బాదం పాలు చాలా మంచివి. ఇందులోని జింక్, ఇతర ప్రోటీన్లు వారిలో ఏమైనా లైంగిక సమస్యలు ఉంటే దూరం చేస్తుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.

Related Posts

‘మైగ్రేన్’ విముక్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?

మైగ్రేన్... తల పగిలిపోతుందా అన్నట్లుగా, నరాలు చిట్లిపోతున్నాయా అనేంతలా భాదించే తలనొప్పి. సాధారణంగా వచ్చే తల నొప్పికి ఒక కప్పు టీ లేదా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ తరుచుగా...

ఆరోగ్యానికి అమృతం… ‘డ్రాగ‌న్ ఫ్రూట్’ ! ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ కారణంగా ప్రజలలో ఈ మధ్య ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మీద అవగాహన పెరిగి ఫ్రూట్స్ వాడకం చాలా ఎక్కువైంది. ఈ క్రమంలోనే 'డ్రాగ‌న్ ఫ్రూట్' ప్రాధాన్యత వాణిజ్యపరంగా బాగా పెరిగింది....

లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఉదయాన్నే వీటిని ట్రై చేయండి !

ఒక మంచి వేకువ జాము దినచర్య అనేది ఎంతో మంది విజయ రహస్యంగా భావించవచ్చు. కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన లక్ష్యాలను చేధించే ప్రక్రియకు శక్తినిస్తాయి. జీవితంలో ఏదో సాధించాలని అనుకునే...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News