Good health: మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని మానాల్సిందే..!!

Good health: మన రోజువారీ జీవన విధానంలో మార్పులు రావడంతో అనారోగ్యానికి మనమే దారులు తెరుస్తున్నాం. ఒత్తిడి, ఉద్యోగం, ఆర్ధిక పరిస్థితులు, ఉరుకుల పరుగుల జీవనం.. ఇలా అనేకం మన లైఫ్ స్టైల్ చేంజ్ కి కారణమవుతున్నాయి. ఇందులో సరైన ఆహారం, టైమ్ కి తినకపోవడం, సమయానికి నిద్రపోక పోవడం, తగినంత నిద్ర లేకకపోవడం, ఒత్తిడి.. ఇవన్నీ కారణాలవుతున్నాయి. వీటిని మార్చుకోగలిగితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.

రోజువారీ జీవితంలో పని వేళలు మారిపోయాయి. ఒత్తిడి ఎక్కువైంది. అందుకు శరీరానికి వ్యాయామాన్ని దూరం చేయకూడదు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామానికి టైమ్ కేటాయించాల్సిందే. వాకింగ్ ఉత్తమం. శరీరాన్ని కాస్తైనా శ్రమ పెట్టెలా రోజుకు పావు గంటైనా ఎక్సర్ సైజులు చేయాలి. కండరాలు, ఎముకలు గట్టిగా ఉండాలన్నా, జీర్ణక్రియ మెరుగవ్వాలన్నా వర్కవుట్స్ చెయ్యాల్సిందే.

మంచి పోషకాలున్న ఆహారాన్ని తగ్గించేసి జంక్ ఫుడ్ వైపుకు మళ్లడం వేస్ట్. ప్రతి వీధిలో జంక్ ఫుడ్ లభిస్తోంది. నూడుల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా.. ఇలా తక్కువ రేటులోనే ఇన్ స్టంట్ గా దొరికే ఈ ఫుడ్ కి అలవాటుపడటం మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. వీటిని తగ్గించి పోషకాలున్న ఫుడ్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

నేడు అంతా డిజిటల్ యుగం. సాంకేతికత మన అరచేతిలో ఉంటోంది. మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ లేకుండా మన రోజు మొదలవడం లేదు. వీటితోనే ఎక్కువ ఉంటున్నాం. వీటికెంత దూరంగా ఉంటే అంత మంచిది. అదేపని సెల్ ఫోన్ చూడటం వల్ల మెడ నొప్పి, కండరాలు, కీళ్లూ దెబ్బతింటాయి. ఆహార అలవాట్లను చెడగొడతాయి. నిద్రలేమిని కలిగిస్తాయి. తినేటప్పుడు మొబైల్ చూడొద్దు. నిద్రపోయే అరగంట ముందే మొబైల్, ల్యాప్‌టాప్ క్లోజ్ చేయడం ఉత్తమం.

కాస్త నలతగా ఉందంటే టాబ్లెట్ల వైపు చూడటం మానేయాలి. జలుబు, తలనొప్పి సహజంగా తగ్గేలానో.. హోమ్ రెమెడీ పాటించడమో ఉత్తమం. అప్పటికీ తగ్గకపోతే టాబ్లెట్లు వాడటం బెటర్. అయితే.. ఒక్కోసారి చిన్న అనారోగ్యాల్ని లైట్ తీసుకోవడమూ తప్పే అవుతుంది. పరిస్థితిని బట్టి వెళ్లాలి. అవసరమైతే డాక్టర్ ని సంప్రదించాలి. ఆరోగ్యం విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరు నెలలకోసారైనా డాక్టర్‌ చెకప్ మంచిది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.