మనలో చాలామంది పుట్టగొడుగులను తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. పుట్టగొడుగులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. పుట్టగొడుగులలో ఎర్గోథియోనిన్, గ్లూటాతియోన్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని యవ్వనంగా ఉంచే విషయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో పుట్టగొడుగులు ఉపయోగపడతాయని చెప్పవచ్చు.
పుట్ట గొడుగులు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో పుట్టగొడుగులు ఎంతగానో తోడ్పడతాయి. పుట్టగొడుగులలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు పుట్టగొడుగుల ద్వారా లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. శాకాహారం తినేవాళ్లు పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకుంటారు.
విటమిన్ డిని అందించడంతో పాటు సూక్ష్మ పోషకాల సమస్యకు చెక్ పెట్టడంలో పుట్టగొడుగులు ఉపయోగపడతాయి. కొన్ని ఔషధాల తయారీలో కూడా పుట్టగొడుగులను వినియోగిస్తారు. ఒత్తిడిని తగ్గించడంలో పుట్టగొడుగులు ఎంతగానో సహాయపడతాయి. శరీరానికి సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యలను సైతం పుట్టగొడుగులు దూరం చేస్తాయని తెలుస్తోంది.
అయితే ఎండిన పుట్టగొడుగులను తినడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎవరైతే పుట్టగొడుగులను తింటారో వాళ్లకు డిప్రెషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కు పుట్టగొడుగులు కారణమవుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉంటే మంచిది.