ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది షుగర్ తో బాధ పడుతున్నారు. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవాలని కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలను పొందలేరు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ ను సులువుగానే అదుపులో ఉంచవచ్చు.
షుగర్ రావడానికి ప్రధానమైన సమస్యలలో నిద్రలేమి ఒకటి. నిద్రలేమి రక్తంలోని షుగర్ లెవెల్స్ ను ప్రభావితం చేస్తుంది. సరైన సమయానికి నిద్రపోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతుంది. 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు.
బరువు కూడా రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతుంది. బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గడం ద్వారా శరీరంలోని షుగర్ లెవెల్స్ సైతం తగ్గుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. గుడ్లు, చిక్కుళ్ళు, బీన్స్ వంటి ఒమేగా 3 కొవ్వులతో పాటు సాల్మన్, అవిసె గింజలు, సోయాబీన్, చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
పానీయాలు, రసాలు, తేనె లాంటి సహజ చక్కెర కలిగిన వాటిని మాత్రమే తీసుకుంటే మంచిది. సరైన సమయానికి మందులు వాడుతూ వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ బరువును అదుపులో ఉంచుకుంటే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. షుగర్ లెవెల్స్ మరీ తగ్గిన ప్రమాదమని చెప్పవచ్చు. చక్కెరతో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది.