సమయం దొరికినప్పుడల్లా నిద్రపోతున్నారా? ఇప్పటికైనా మేల్కోండి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు!

మనం నిద్రపోయే విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఏ సమయంలో నిద్ర పోవాల? వంటి అనేక సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.సరైన నిద్ర మానసిక ప్రశాంతతని, ఒత్తిడిని తగ్గించి మీలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో దోహదపడుతుంది. అలాగని మరీ ఎక్కువ సమయం నిద్రపోయినా, నిద్రలేమితో బాధపడుతున్న ఈ రెండు అనారోగ్యానికి సూచికలుగా భావించవచ్చు.వైద్యుల సూచనల ప్రకారం ప్రతిరోజు 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. 8 గంటల కంటే తక్కువ సమయం నిద్రించేవారు నిద్రలేమి సమస్యతో బాధపడుతూ మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారని అర్థం. ఎనిమిది గంటలకంటే ఎక్కువ సమయం నిద్రించేవారు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మన శరీరంలోని క్యాలరీలు ఖర్చు కావు దాంతో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధులు చుట్టుముడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.అతిగా నిద్ర పోవడం వల్ల గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దానివల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ సమయం నిద్రించే అలవాటు ఉంటే వెంటనే అలవాటు మార్చుకోవడం మంచిది

అతిగా నిద్రపోవడం రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి ఇన్సులిన్ వ్యవస్థ పై ప్రభావం పడుతుంది. ఫలితంగా చిన్న వయసులోనే డయాబెటిస్ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది.అతినిద్ర వ్యాధితో బాధపడేవారు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లవచ్చు. ఎందుకంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల మనిషి శారీరక శ్రమ తగ్గుతుంది దాంతో మెదడుపై తీవ్ర ప్రభావం పడి మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది. అతిగా నిద్ర పోవడం వల్ల మెదడు చురుకుదనం తగ్గి బద్దకంగా తయారవుతారు. మానసిక రుగ్మత ఏర్పడి సొంతంగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ తగ్గుతుంది, జ్ఞాపకశక్తి లోపించి అన్నిట్లో వెనుకబడిపోతారు. శారీరక శ్రమలోపిస్తే శరీర బరువు అమాంతం పెరిగి ఉపకాయ సమస్య తలెత్తుతుంది.