చేపలు మన సంపూర్ణ ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలను ఏ సీజన్లో అయినా నిక్షేపంగా ఆహారంగా తీసుకోవచ్చు అయితే శీతాకాలంలో వీటిని ఎక్కువగా తినడం వల్ల అదనపు ప్రయోజనాలు పొందవచ్చునని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్న చలికాలంలో చేపలను ఆహారంగా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ప్రతి కణానికి అవసరమైన ప్రోటీన్లు చేపల్లో సమృద్ధిగా లభిస్తాయి. అలాగే తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు, విటమిన్స్ మినరల్స్ ఖనిజ లవణాలు చేపల్లో పుష్కలంగా లభిస్తాయి.
చేపలను కొనేటప్పుడు చిన్న చేపలను కాకుండా పెద్ద చేపలను తీసుకుంటే మన శరీరానికి మంచి చేసే తొమ్మిది రకాల ఒమేగా కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి.వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలను ఆహారంగా తీసుకుంటే వీటిలో అధికంగా ఉండే కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్, నూనెలు మన శరీరాన్ని అత్యల్ప ఉష్ణోగ్రతల నుంచి రక్షించి చర్మం పొడి వారకుండా మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. చలి తీవ్రత వల్ల శరీరం బిగుసుకుపోయి తీవ్ర ఒళ్ళు నొప్పుల సమస్యను అధిగమించవచ్చు.అలాగే సీజనల్గా వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని రక్షించి మనలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.
చేపల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ,పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు అయోడిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అయోడిన్ పిల్లల మెదడు పెరుగుదలకు సహకరించి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది
ప్రమాదకర థైరాయిడ్ సమస్యలు నియంత్రిస్తుంది. మన శరీరంలో పొటాషియం పరిమాణం . మన శరీరంలో పొటాషియం పరిమాణం తగ్గితే రక్త ప్రసరణ వ్యవస్థలో లోపం ఏర్పడి హైబీపీ సమస్య వస్తుంది. అలాగే మన శరీరం కాల్షియం గ్రహించే శక్తి లోపించి మూత్రం ద్వారా కాల్షియం బయటికి వెళ్లిపోతుంది. చలికాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది కాబట్టి పొటాషియం సమృద్ధిగా లభించే చేపలను ఆహారంగా తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
చేపల్లో విటమిన్ డి , విటమిన్ ఏ ,విటమిన్ B2 రైబోఫ్లావిన్ అధికంగా లభించి శరీర కణాల అభివృద్ధిలో సహాయపడి ఎముకలు కండరాలు దృఢంగా ఉంచడం ఉంచుతాయి. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.