అర్జున చెట్టు అద్భుతమైన ప్రయోజనాలు మీకు తెలుసా.. ఆ వ్యాధులకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్!

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో అర్జున చెట్టు గురించి వినే ఉంటారు. అర్జున చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. ఈ చెట్టును కొంతమంది తెల్లమద్ది చెట్టు అని కూడా పిలుస్తారు. అర్జున చెట్టు ఎన్నో ఔషధ విలువలను కలిగి ఉంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచడం, దగ్గును నివారించడం, అదనపు ఆమ్లత్వం లాంటి సమస్యలకు అర్జున చెట్టు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది.

ఎన్నో వ్యాధుల నివారణకు ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. జలుబు, ఫ్లూ, గొంతునొప్పి, ఇతర ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టడంలో ఈ చెట్టుకు మరేదీ సాటి రాదు. చిన్నపిల్లలు, పాలిచ్చే తల్లులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు మినహా ఎవరైనా ఈ అర్జున చెట్టు మూలికలను వాడవచ్చు. కొలెస్ట్రాల్, బీపీని తగ్గించడంలో ఈ చెట్టు బెరడు ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం అర్జున చెట్టును ఆయుర్వేద వైద్యులు సైతం ఉపయోగిస్తారు. శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో అర్జున చెట్టు బెరడు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. షుగర్, దగ్గు లాంటి సమస్యలను సైతం ఈ అర్జున చెట్టు బెరడు దూరం చేస్తుందని చెప్పవచ్చు. విరిగిన ఎముకల కోసం కూడా ఈ అర్జున చెట్టు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

మయో కార్డియల్ ఇన్ఫెక్షన్, కరోనరీ హృదయ వ్యాధి, ఇతర వ్యాధులకు చెక్ పెట్టడంలో అర్జున చెట్టు బెరడు తోడ్పడుతుంది. గుండె వైఫల్యం మరియు గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టే విషయంలో ఈ చెట్టుకు మరేదీ సాటిరాదని చెప్పవచ్చు. రక్తం గడ్డ కట్టడాన్ని నిర్మూలించే విషయంలో అర్జున చెట్టు బెరడు ఉపయోగపడుతుంది.