గుమ్మడికాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Cutting pumpkin

మనలో చాలామంది గుమ్మడికాయను దిష్టి తీయడం కోసం ఉపయోగిస్తారు. గుమ్మడికాయతో చేసిన వంటకాలను తినవచ్చని చెబితే ఎవరూ నమ్మరు. గుమ్మడికాయతో చేసిన వంటకాలను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సాంబారు తయారీలో, హల్వా తయారీలో గుమ్మడికాయను ఉపయోగిస్తామనే సంగతి తెలిసిందే.

అయితే వీటితో పాటు గుమ్మడికాయతో వంటకాలను చేసుకుని తిన్నా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. గుమ్మడి కాయలలో బీటా కెరొటిన్ పుష్కలంగా ఉండగా బీటా కెరొటిన్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పని చేస్తుంది. గుమ్మడి ముక్కలను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడటంతో పాటు కంటి సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలు సులభంగా దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గుమ్మడికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. గుమ్మడికాయతో చేసిన వంటకాలు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. గుమ్మడికాయతో చేసిన వంటకాలను తింటే శరీరానికి అవసరమైన పొటాషియం లభిస్తుందని చెప్పవచ్చు.

పొటాషియం వల్ల శరీరంలో రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎముకల సాంద్రతను మెరుగుపరచడంలో, పక్షవాతం ముప్పును తగ్గించడంలో గుమ్మడికాయలు తోడ్పడతాయి. కొవ్వు స్థాయిలు పెరిగేలా చేయడంలో గుమ్మడి తోడ్పడుతుంది. గుమ్మడిలో కేలరీలు తక్కువగా పీచు ఎక్కువగా ఉండటం వల్ల బరువు అదుపులో ఉంటుంది. గుమ్మడి తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. నిద్ర సమస్యలకు సైతం గుమ్మడి చెక్ పెడుతుంది. గుమ్మడి తినడం అలవాటు లేని వాళ్లు ఇకపై ఆహారంలో గుమ్మడిని భాగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.