Soya: మన ఆహారంలో సోయా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సోయాలో ప్రొటీన్స్ ఎక్కువ. మనకు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మన ఆహారంలో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉండాలా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. అలానే.. ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సోయాలో ఈ రెండు ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీనిలో సొయా ఫుడ్ ని రికమెండ్ చేస్తుంది.
సోయా బీన్స్ నుండి ఈ ఆహార పదార్థాలను తయారు చేస్తారు. వీటిలో అధికంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటంతోపాటు.. మరిన్ని పోషకాలు ఉంటాయి. ఇది మొక్కల ద్వారా వస్తాయి. ఎమైనో యాసిడ్స్ మాంసాహారంలో దొరుకుతాయి. కానీ.. అందరూ అవి తినరు కాబట్టి అటువంటివారికి సోయా బాగా ఉపయోగపడతాయి. సోయా పిండి, సోయా పాలు ద్వారా మంచి ప్రొటీన్స్ ఎక్కువగా అందుతాయి. వీటిలో 26 రకలా ప్రొటీన్లు, 31 శాతం కొవ్వు పదార్ధాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరం.
సోయాలో ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లాక్టోస్, కాల్షియం కూడా పొందొచ్చు. వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాల్షియం లోపం ఉన్నవాళ్లు సోయా ఫుడ్ తీసుకోవడం ఉత్తమం. దీనిలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలకు మంచింది. సోయాలో యాంటీ న్యూట్రియన్స్, పల్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరికీ ఇవి ఎంతో మంచిది.
సోయాబీన్స్ నూనె వంటల్లో కూడా ఉపయోగిస్తారు. కొవ్వు లేని పాలు దొరుకుతాయి. ఇవి కూడా ఎంతో బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. సోయా బీన్స్, సోయా గ్రాన్యూల్స్, సోయా పాలు, సోయా పిండి, సోయా నట్స్ ఇలా.. ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. శాచురేటెడ్ ఫ్యాట్ ఇందులో తక్కువ ఉంటుంది. పెద్దలు తేడా లేకుండా అందరికీ మంచిది. పాలలో ఉండే ప్రోటీన్‌లకు సమానంగా సోయా బీన్స్ ద్వారా ప్రోటీన్స్‌ను పొందొచ్చు. అందుకే మన డైట్ లో సోయాను చేర్చుకుంటే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.