ఎండు ద్రాక్షను ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాన్ని గుర్తించుకోండి?

తీపి పులుపు రుచుల సమ్మేళనంతో అద్భుతమైన రుచిని కలిగి ఉండే ఎండు ద్రాక్ష మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతో సహాయపడుతుంది. సాధారణంగా ఎండు ద్రాక్షను కొన్ని రకాల స్వీట్లులోను మరియు డ్రై ఫ్రూట్స్ గా ఎక్కువగా తింటుంటారు. అలాకాకుండా ఎండు ద్రాక్షను రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే అల్పాహారానికి ముందే ఆహారంగా తీసుకుంటే వీటినుంచి సంపూర్ణ పోషకాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

నానబెట్టిన ఎండు ద్రాక్షను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, పోలేట్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే ఎండు ద్రాక్షలో ఉన్న యాంటీ మైక్రోబియన్ గుణాలు అన్ని రకాల ఇన్ఫెక్షన్లతో సమృద్ధిగా పోరాడే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది వీటిలో అధికంగా ఉండే ఐరన్, విటమిన్ సి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడి ఇమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంతోపాటు అధిక ఒత్తిడి సమస్యను దూరం చేస్తుంది. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంతోపాటు ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి వ్యాధులను అదుపు చేయడంలో సహాయపడతాయి. ఎండు ద్రాక్షలో అత్యధికంగా ఉన్న పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరులు మెరుగుపరిచి మలబద్ధక సమస్యలను తొలగిస్తుంది.

ఎండు ద్రాక్షలో మెల్లటోని అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచి గుణం సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని తరచూ ఆహారంలో తీసుకుంటే నిద్రలేమి సమస్యలను దూరం చేయడంతో మానసిక ప్రశాంతతను కలిగించి జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.ఎండుద్రాక్షలో ఫినాల్ అనే యాంటీఆక్సిడెంట్ చర్మం కొల్లాజెన్ కణాలను దెబ్బతీయకుండా ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి చర్మంపై మచ్చలు, మొటిమలు, ముడతలను తగ్గించి వృద్ధాప్య ఛాయాలను నివారించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.ఎండుద్రాక్షలో ఒలియానోలిక్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది నోటిలోని ప్రమాదకర బ్యాక్టీరియాను తొలగించి దంతాలపై ఉండే ఎనామిల్ పొరను రక్షించడంలో సహాయపడుతుంది.