లోబీపీ సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే సమస్యకు చెక్?

Blood-pressure-measuring-studi

ఈ మధ్య కాలంలో చాలామందిని లోబీపీ సమస్య వేధిస్తోంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొన్నిసార్లు ఈ సమస్య వల్ల ప్రాణాపాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కళ్లు మసకగా మారుతున్నా, త్వరగా అలసిపోతున్నా, తల తిరిగినట్లుగా అనిపిస్తున్నా లో బీపీ కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లో బ్లడ్ ప్రెజర్ ను హైపో టెన్షన్ అంటారు. హైపో టెన్షన్ వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా ఆగిపోయి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. హిమాలయన్ ఉప్పును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది.

లో బీపీ ఉన్నవాళ్లు కాఫీని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం ద్వారా కూడా లో బీపీ సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. రోజ్ మేరీ నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల కూడా సత్ఫలితాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉప్పు నీరు తాగడం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుంది.

సమస్య మరీ తీవ్రంగా ఉంటే వైద్యుల సలహా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. తక్కువ రక్తపోటు వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా సమస్యకు చెక్ పెట్టవచ్చు. లో బీపీ సమస్య మరీ తీవ్రమైతే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.