శొంఠి పానీయాన్ని సేవిస్తే చాలు… ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ మీ సొంతమైనట్లే?

ఎన్నో ఔషధ గుణాలు ఉన్న అల్లాన్ని ప్రత్యేక పద్ధతుల్లో ఆరబెట్టి డ్రై అల్లంగా మారుస్తారు. దీన్నే శొంఠి అని కూడా పిలుస్తారు.శొంఠి పొడి రూపంలో ప్యాకెట్లలో కూడా లభ్యమవుతుంది. శొంఠి పొడిని ఉపయోగించి శొంఠి పాలు, శొంఠి కాఫీ వంటి పానీయాలను తయారు చేసుకొని సేవించవచ్చు లేదా రోజు వారి ఆహారంలో కొద్ది పరిమాణంలో ఉపయోగిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమైనట్లే. డ్రై అల్లం లో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ గుణాలు పుష్కలంగా ఉండి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి.

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే శీతాకాలం లాంటి సీజన్లలో ప్రతిరోజు శొంఠి పొడిని పాలు లేదా నీళ్లలో కలుపుకొని ప్రతిరోజు ఉదయం ,సాయంత్రం సేవిస్తే సీజనల్గా వచ్చి దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి ఫ్లూ లక్షణాల నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. జీర్ణశక్తి తక్కువగా ఉండి గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా శొంఠి చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.ముఖ్యంగా శీతాకాలంలో శొంఠి పానీయాన్ని ప్రతి రోజూ తీసుకుంటే శరీరం జీవక్రియ రేటు పెరిగి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు
శొంఠి పానీయాన్ని సేవిస్తే వీటిలో ఉండే ఔషధ గుణాలు ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే మైక్రోబ్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. డ్రై అల్లం లో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది ఇది రక్తంలో చక్కెర శాతం తగ్గించి డయాబెటిస్ వ్యాధిని అదుపు చేస్తుంది. రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శ్వాస సంబంధిత అలర్జీలను ,ఇన్ఫెక్షన్లను తగ్గించి బ్రాంకైటిస్, న్యుమోనియా , ఉబ్బసం ఆస్తమా వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రతిరోజు శొంఠి పానీయాన్ని సేవిస్తే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.