నాగబాబు కామెంట్స్ వెనుక పొలిటికల్ స్ట్రాటజి?

బాలయ్యపై నాగబాబు కామెంట్ల యుద్ద విరమణ చేయలేదు. మరింత ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. కామెంట్ నెంబర్ 1, కామెంట్ నెంబర్ 2 టైటిల్స్ తో వీడియోలు విడుదల చేస్తున్నారు. వాటిల్లో లో పరోక్షంగా బాలకృష్ణని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. బాలయ్య గతంలో ఓ టీవీ ఛానెల్ లో ”ఒకరిని హీరో చేయడం ఇష్టం లేదు.. మేమే సూపర్ స్టార్స్” అని కామెంట్ చేయటాన్ని గుర్తు చేస్తూ కౌంటర్ కామెంట్స్ స్టార్ట్ చేసారు.

నాగబాబు మాట్లాడుతూ.. ”పవన్ కల్యాణ్ కామెంట్ చేశాడు.. మీ ఒపీనియన్ ఏంటని ఓ చానెల్ వారు ప్రశ్నిస్తే.. అప్పుడు మీరు పవన్ కల్యాణ్ తప్పుగా మాట్లాడారు.. పవన్ కల్యాణ్ కరెక్ట్ గా మాట్లాడలేదని విమర్శించొచ్చు. కానీ మీరు మాకు మేమే హీరోలం.. మేమే సూపర్ స్టార్లం..” అలా అనడం ఏంటని ప్రశ్నించి హాట్ టాపిక్ గా మారారు నాగబాబు.

అలాగే మీరు సూపర్ స్టార్లే మాకు అందులో అబ్జెక్షన్ లేదని.. కానీ మిగతా వాళ్లు కాదా..? మీరేనా సూపర్ స్టార్లు.. మీరేనా గొప్ప నటులు.. పవన్ కల్యాణ్ కాదా..? అసలు ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి..? మాకు కౌంటర్ చేయడం చేతకాదా..? అంటూ విరుచుకుపడ్డారు.

ఇదంతా చూస్తున్న మీడియా వాళ్లకు ఎప్పుడూ సైలెంట్ గా ఉండే నాగబాబు హఠాత్తుగా ఇలా కామెంట్స్ చేయటం వెనక విషయం ఏంటని ఆలోచించటం మొదలెట్టారు. ఎందుకంటే బాలకృష్ణ నిజంగా ఆ కామెట్స్ చేసిన రోజే ..రిప్లై ఇవ్వచ్చు..ఇంతకాలం ఆగి ఇప్పుడు ఇలా కామెంట్స్ వర్షం కురిపించటం ఎందుకు, పాతవన్నీ ఎందుకు తవ్వుతున్నారనేది అనేది వారి క్వచ్చిన్.

అయతే ఈ ప్రశ్నలన్నిటికి కొన్ని మీడియా వర్గాలు తమ కథనాలతో చెప్పే సమాధానం ఒకటే..ఈ కామెంట్స్ వివాదం వెనక ఓ పెద్ద పొలిటికల్ మోటీవ్ ఉందని. గోదావరి జిల్లాలో ఉన్న ఓ సామాజిక వర్గం కు దగ్గర అవ్వటం కోసం నాగబాబు ప్లే చేస్తున్న స్ట్రాటజీ అంటున్నారు. ఇవన్నీ చూసిన బాలకృష్ణ నోరు జారితే కనుక..వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పెంచుతారని, అలా ఆ వర్గాన్ని సంఘటితం చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీకి దూరం చేసి, జనసేనకు దగ్గర చేయటమే లక్ష్యం అంటున్నారు. ఇది నమ్మచ్చా అంటే…రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి నిజా నిజాలు అంచనా వేసుకోవాలి.