భానుప్రియ కేసు..క్రిమినల్ కేసు గా మారబోతోందా?

నటి భానుప్రియ ఇంటి పనిమనిషి కథ ఎట్టకేలకు సుఖాంతమైందనుకునేలోగా మరో కేసు చుట్టుకుంది. ఇప్పుడు ఆమెను చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం క్రిమినిల్ కేసు పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకునే వారిపై చైల్డ్ లేబర్ యాక్ట్, 14-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలను ముఖ్యంగా ఇతర రాష్ర్టాల నుంచి తీసుకొని వచ్చే వారిపై బాండెడ్ లేబర్ యాక్ట్ కింద పూర్తి ఆధారాలతో కేసులు నమోదు చేస్తారురు. ఆంధ్రప్రదేశ్ నుంచి భానుప్రియ తమిళనాడు తీసుకుని వెళ్లటం, ఆ పిల్ల వయస్సు తక్కువ కావటంతో ఈ లేబర్ యాక్ట్స్ ప్రకారం సమస్యలు వచ్చే అవకాసం ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట, సండ్రవారి గ్రామానికి చెందిన ప్రభావతి తన కూతుర్ని కొడుతూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపీకృష్ణలపై సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసిన విషయం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి భానుప్రియను విచారించడానికి చెన్నైకి వచ్చారు.

కాగా నటి భానుప్రియ చెన్నైలో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఇంటి పనికి తీసుకొచ్చిన 16 ఏళ్ల యువతి ఇంట్లో దొంగతనానికి పాల్ప డిందని, తాము అడగడంతో దొంగిలించిన కొన్ని వస్తువులను తిరిగి ఇచ్చిందని, ఇంకా విలువైన వస్తువులు ఇవ్వలేదని చెప్పారు. తానే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే వద్దని పనిమనిషి తల్లి ప్రభావతి ఏడ్చిందని తెలిపారు. పోలీసులు, పిల్లల సంరక్షణ విభాగం వారు పనిపిల్లను తీసుకెళ్లారని నటి భానుప్రియ తెలిపారు.