AP Police: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పోలీసుల గురించి మాట్లాడిన తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హోం శాఖ మంత్రి అనిత జగన్ మాటలపై విమర్శలు కురిపించారు. కొంతమంది పోలీసులు చంద్రబాబు నాయుడుకి కొమ్ము కాస్తున్నారని అలా పని చేసే వారికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శిక్ష తప్పదని బట్టలూడదీసి రోడ్డుపై నిలబెడతాను అంటూ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ఇలా పోలీసుల గురించి జగన్ మాట్లాడిన తీరుపై పోలీసు సంఘం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. అయితే.. ప్రభుత్వ పరంగా కంటే కూడా.. న్యాయ పోరాటం ద్వారానే పోలీసులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. అదేవిధంగా రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు కూడా మీడియా ముందుకు వచ్చారు. జగన్ చేసిన వ్యాఖ్యలను తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న తమపై రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి పోలీసుల గురించి ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు సప్త సముద్రాల వెనుక ఉన్న లాక్కొస్తానని మాట్లాడారు. ఇప్పుడు బట్టలూడదీస్తామంటూ మాట్లాడుతున్నారు. ఇది.. నైతికంగా పోలీసుల మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడమేనని చెప్పారు. రాజకీయాలు చేసేందుకు పోలీసులసు ఎవరూ సిద్ధంగా లేరని.. దీనిపై న్యాయ పరంగానే పరిష్కరించుకునేందుకు తాము చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నామని శ్రీనివాసులు తెలిపారు.
రాబోయే రోజులలో కూడా పోలీసులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత విధులపై వారికి విశ్వసాన్ని కల్పించాల్సిన అవసరం సంఘంగా తమకు బాధ్యత ఉందన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసు సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించే జగన్మోహన్ రెడ్డి పై పిటిషన్ దాఖలు చేయబోతున్నారు.