Hit 3: హిట్3 సినిమా మూవీ మేకర్స్ పై కేసు వేసిన అభిమాని.. అసలేం జరిగిందంటే!

Hit 3: హిట్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి భాగం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా 3 పార్ట్ లుగా విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవల అనగానే 1వ తేదీన హిట్ 3 సినిమా విడుదల అయింది. మొదట్లో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోయింది. హిట్‌3: ది థర్డ్‌ కేస్‌ హీరో నాని కెరీర్‌లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయన సినిమాగా నిలిచింది.

శైలేష్‌ కొలను దర్శకత్వంలో వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ మూవీలో హింస ఎక్కువగానే ఉందని టాక్‌ వచ్చినప్పటికీ భారీ విజయాన్ని అందుకుంది. హిట్‌1, హిట్2 చిత్రాల‌కు సీక్వెల్‌గా హిట్‌ 3 మూవీని దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా స్టోరీని కాపీ కొట్టారు అంటూ మహిళా రచయిత విమల్ సోనీ తాజాగా మద్రాస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె నానికి వీరాభిమాని అని కూడా చెప్పారు.

గతంలో తాను రాసిన ఏజెంట్ 11, ఏజెంట్ V కథల నుంచి కాపీ కొట్టి హిట్ 3 సినిమా తీశారని ఆమె తెలిపారు. దీంతో హిట్‌ 3 సినిమా మేకర్స్ పై మద్రాస్ హైకోర్టులో కాపీ రైట్ కేసు వేశారు. ఈ క్రమంలో తను రచించిన ఒరిజినల్‌ కాపీని కోర్టుకు సమర్పించారు. గ‌తంలో కూడా ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌నుపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. వెంకటేశ్‌ తో తాను దర్శకత్వం వహించిన సైంథ‌వ్ సినిమా కథ కూడా కాపీ కొట్టారని అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మరి ఈ విషయంపై దర్శకుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.