ఇలియానా బాలీవుడ్‌లో చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో మునిగిపోయింది. అయితే ఆ ప్రేమ ఎంతో కాలం సాగలేదు. మనస్పర్థల కారణంగా ఈ మధ్యనే బ్రేకప్ అయ్యింది. అయితే ఆండ్రూతో లవ్ బ్రేకప్ నటి ఇలియానాపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. దీని గురించి ఇలియానా చెబుతూ… “ఆ మనోవేదన నుంచి బయటపడడానికి వారమంతా ఆస్పత్రి చుట్టూ తిరిగాను. సినిమాల్లో నటించడం కూడా మానుకున్నానని చెప్పింది.మనో వేదనతో ఒక సమయంలో రోజుకు 12 మాత్రలు వేసుకున్నానని చెప్పింది. అందువల్ల బరువు పెరిగిపోయా… బరువు తగ్గడానికి జిమ్‌కు వెళదామనుకుంటే.. ఆ ఫొటోలను తీసి, ఎక్కడ సోషల్ మీడియాలో పెడతారోనన్న భయం కలిగేది. అందుకే జిమ్‌కు వెళ్లడం కూడా మానేశా… అలా కొంత కాలం గదిలోనే ఏకాంతంగా గడుపుతూ ..చాలా మానసికవేదనకు గురైనట్లు చెప్పింది . ఇలియానా ఇప్పుడు మళ్లీ నటనపై పూర్తిగా దృష్టిసారించినట్లు తెలిపింది. ఆమె ఇప్పటికే ‘అమర్ అక్బర్ అంధోనీ’ తెలుగు చిత్రంలో నటించినా.. అది సత్ఫలితాన్నివ్వలేదు.ప్రస్తుతానికి హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ దక్షిణాదిలో అవకాశాలకోసం ఎదురు చూస్తోంది.
మళ్లీ నటనపై ఇలియానా దృష్టి
