Ileana: స్టార్ హీరోయిన్ ఇలియానా గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు పూర్తి దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితాన్ని ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. మనకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇకపోతే రెండేళ్ల క్రితం ఇలియానా ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఆగస్టు తో ఆ బిడ్డకు రెండేళ్లు పూర్తి అవుతాయి. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఇలియానా మరోసారి బేబీ బంప్ తో కనిపించింది. అంటే ఈమె రెండోసారి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆ ఫోటో ద్వారా చెప్పకనే చెప్పేసింది. దీంతో అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే తాజాగా ఇలియానా అభిమానులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే కొందరు అడిగిన వాటికి ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఒక నెటిజన్ ఇలియానా పెళ్లి గురించి ప్రస్తావని తీసుకువస్తూ.. మీకు పెళ్లి అయిందా? లేదంటే కేవలం బిడ్డను మాత్రమే కన్నారా? అని అడగగా..
ఇలియానా వెరైటీగా సమాధానం ఇచ్చింది. ఆలోచిస్తున్నట్టు ఉన్న ఎమోజీ షేర్ చేస్తూ.. ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న? అని అన్నారు. అలా తెలివిగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు ఇలియానా. ఇంతలోనే మరొక నెటిజెన్ రైడ్ 2 సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం అని కామెంట్ చేయగా.. రైడ్ 2 కోసం నన్ను సంప్రదించారు.. కానీ అప్పుడు నేను నా బిడ్డ కోసం ఆగిపోయాను.. బిడ్డ సంరక్షణ, బాగోగులు చూసుకోవడమే నా ప్రథమ కర్తవ్యం అని భావించాను.. అందుకే నేను నటించలేను అని చెప్పాను. వాణీ కపూర్ అద్భుతంగా నటించారు అని క్లారిటీ ఇచ్చారు ఇలియానా.