Tollywood: ఆమె ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో ప్రభాస్ మహేష్ బాబు ఎన్టీఆర్ రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తర్వాత తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల ఒక పండంటి బాబుకు జన్మనిచ్చిన ఈ హీరోయిన్ ఇప్పుడు రెండవసారి తల్లి కాబోతున్నట్టు చెప్పకనే చెప్పేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? నెట్టింట వైరల్ అవుతున్న ఆ ఫొటోస్ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే..
ఆ హీరోయిన్ మరెవరో కాదు ఇలియానా. మహేష్ బాబుతో కలిసి నటించిన పోకిరి సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలియానా పేరు మారుమోగింది. కాగా ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాలలో నటించింది. అయితే ఈమె గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మైఖేల్ డోలన్ అనే విదేశీయుడితో డేటింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ 2023లో పండంటి బాబుకు కూడా జన్మనిచ్చింది. తన కొడుకుకు ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టినట్లు చెబుతూ కొడుకు ఫోటోస్ షేర్ చేసిన విషయం తెలిసిందే.
అలాగే తన బాబు మొదటి పుట్టిరోజు వేడుకల ఫోటోస్ సైతం అభిమానులతో పంచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఇలియానా తన స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టా స్టోరీలో పంచుకుంది. అందులో ఇద్దరూ బేబీ బంప్స్ తో కనిపిస్తున్నారు. ఇద్దరూ బేబీ బంప్స్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ బంప్ బడ్డీస్ అని రాసుకొచ్చింది ఇలియానా. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. అందులో ఇలియానా ప్రెగ్నెంట్గా బేబీ బంప్ కనిపిస్తుండడంతో అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రెండవసారి తను తల్లి కాబోతున్నట్టు ఈ ఫొటోస్ ద్వారా చెప్పకనే చెప్పేసింది ఇలియానా.