Ileana: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు పూర్తి దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితాన్ని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది.
అలాగే తన భర్త, కొడుకుతో కలిసి దిగిన ఫోటోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే రెండేళ్ల క్రితం ఇలియానా ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆగస్టు తో ఆ బిడ్డకు రెండేళ్లు పూర్తి అవుతాయి. ఇకపోతే ఇటీవల ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఇలియానా మరోసారి బేబీ బంప్ తో కనిపించింది. అంటే ఈమె రెండోసారి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆ ఫోటో ద్వారా చెప్పకనే చెప్పేసింది.
దీంతో అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉంటే తాజాగా నేడు తనకు మరో బాబు పుట్టినట్టు తెలిపి అతని క్యూట్ ఫోటోలని షేర్ చేసి పేరు కూడా తెలిపింది. ఇలియానా తన రెండో కొడుకు ఫోటో షేర్ చేసి జూన్ 19న జన్మించినట్లు, అతని పేరు కేను రాఫ్ డోలన్ అనే పేరు పెట్టినట్టు తెలిపింది. ఇలియానా షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.